భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పాఠశాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ అంతర్గత మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రరంభిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్లోని అన్ని పాఠశా లలకూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్ నే అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఎన్సీఈఆర్టీ సిలబస్ చదువుతూనే రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తున్నారు. అయితే సీబీఎస్ఈ విధానంలో అంతర్గత మార్కుల విధానం ఉంది.
గతంలో నిరంతర, సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో అంతర్గత మార్కులు ఉండగా.. 2019లో వీటిని రద్దు చేశారు. అంతర్గత మార్కుల విషయంలో ప్రభుత్వ బడులు నిబంధనలు పాటిస్తున్నా.. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుంటున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరం నుంచి పదిలో రాత పరీక్షకు 80 మార్కులు, అంతర్గతంగా 20 మార్కులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసు కోకుండా పకడ్బందీ విధానాన్ని తీసుకువ చ్చేలా ఆలోచన చేస్తున్నారు. సీబీఎస్ఈలో అంతర్గత మార్కులు 20 కి 20 వేసుకోకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాంటి దాన్నే తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో సూక్ష్మ, లఘు ప్రశ్నలు 12 ఉండగా.. వీటికి ఒక్కో దానికి అరమార్కు, తేలికైన 8 ప్రశ్న లకు ఒక్కో మార్కు ఉండగా.. వీటిని ఒక్కో మార్కు ప్రశ్నలుగా మార్పు చేయాలనే దాని పైనా కసరత్తు చేస్తున్నారు.