July 31, 2025 11:25 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

గోడ ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ‌

భార‌త్ సమాచార్.నెట్‌, వరంగల్: అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభ గోడ పత్రికలను పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ నర్సంపేట పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయం ఆవరణలో బీసీ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఆగస్ట్ 7న గోవాలో పెద్ద ఎత్తున జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభలను జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. గోవా యూనివర్సిటీ దగ్గరలో ఉన్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగే గోడ పత్రికలను నర్సంపేట పట్టణంలో ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మేమెంతో మాకంత వాటా దక్కాలని, దేశవ్యాప్తంగా తక్షణమే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బిసి కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డ్యాగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శులు చెన్నూరి రవి ముదిరాజ్, బొనగాని రవీందర్ నర్సంపేట మండల ఉపాధ్యక్షులు భేతి విశ్వబందు, దుగ్గొండి మండల నాయకులు కడారి సురేష్ యాదవ్, సంకటి శ్రీనివాస్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, గుండు బాబ్జీ, మద్దెల కొమురయ్య యాదవ్, గుంటుక రాజ్ కుమార్, తడిగొప్పుల ప్రవీణ్ కుమార్, కామిశెట్టి రమేష్, బోళ్ల రవీందర్, కందికొండ సురేష్, భవ్య, లలిత, శ్రావ్య, జ్యోతి, అంకిత, అశ్విని తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

బెగ్గర్ ఫ్రీ సిటీల్లో వరంగల్.. మిగతా నగరాలు ఏవంటే

Share This Post
error: Content is protected !!