July 28, 2025 12:27 pm

Email : bharathsamachar123@gmail.com

BS

ఆన్ లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ సమాచార్, జాతీయం ;

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ఆన్ లైన్ వేదికగా పలు వ్యవసాయ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం పలుకుతోంది. 8 వారాల వ్యవధి గల 3 రకాల కోర్సులను అందుబాటులో ఉంచినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఇటీవల తెలిపారు. ఆసక్తిగల రైతులు, మహిళలు, యువత ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీ వంటి మూడు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. మూడు కోర్సులు కూడా చాలా ఆసక్తికరంగా, స్వయం ఉపాధికి ఊతం ఇచ్చేలా ఉంటాయని ఆయన అన్నారు.

కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలకు అధికారిక www.angrau.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని అభ్యర్థులను కోరారు.  8008788776, 8309626619, 8096085560 సెల్‌ నంబర్ల ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించి జూన్‌ 20వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు.

మరికొన్ని సంగతులు…

ఆ రోజున రైతుల ఖాతాల్లో నగదు జమ

Share This Post
error: Content is protected !!