July 28, 2025 12:07 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Kerala: కేరళ వెళ్లాలనుకుంటున్నారా? ఇదీ మీకోసమే

భారత్ సమాచార్.నెట్: భారతదేశంలో ప్రకృతి (Nature) అందాలకు కొదవ లేదు. ముఖ్యంగా కేరళ (Kerala) రాష్ట్రంలో ప్రకృతిని ఆశ్వాదించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు. కేరళను సందర్శించాలని ప్లాన్ చేయాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించింది. కేరళలోని చాలా ప్రాంతాలను అతి తక్కువ బడ్జెట్‌లో సందర్శించేలా ఈ ప్యాకేజీను రూపొందించారు.

ఇక హైదరాబాద్ నుంచి కేరళకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. భారత రైల్వే టూరిజం అండ్ కార్పొరేషన్ (IRCTC) ఈ ప్యాకేజీని నిర్వహిస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా అలెప్పీ, మున్నార్‌ వంటి ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు కేరళకు ప్రత్యేకత తీసుకొచ్చే పచ్చటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు.

ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://www.irctctourism.com వెళితే, ‘KERALA HILLS & WATERS’ అనే పేరుతో ఈ ప్యాకేజీ వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఏప్రిల్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ప్యాకేజీ వివరాలు… ఈ ట్రిప్‌ మొత్తం 5 రాత్రులు, 6 రోజులు పాటు సాగుతుంది. ప్రయాణం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. టూర్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి.

కంఫర్ట్ 3ఏ క్లాస్‌లో:

సింగిల్ షేరింగ్‌ — ₹35,180

డబుల్ షేరింగ్‌ — ₹20,260

ట్రిపుల్ షేరింగ్‌ — ₹17,450

స్టాండర్డ్ క్లాస్‌లో:

సింగిల్ షేరింగ్‌ — ₹32,450

డబుల్ షేరింగ్‌ — ₹17,530

ట్రిపుల్ షేరింగ్‌ — ₹14,720

5 నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారుల కోసం కూడా ప్రత్యేక టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే లేదా బుకింగ్ చేయాలంటే, IRCTC టూరిజం వెబ్‌సైట్ అయిన https://www.irctctourism.com/ ను సందర్శించవచ్చు.

Share This Post
error: Content is protected !!