Homeఆంధ్రప్రదేశ్టాలీవుడ్ జగ్గూ భాయ్  

టాలీవుడ్ జగ్గూ భాయ్  

భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ లో సినీ ప్రేమికులు జగ్గూ భాయ్ అని ముద్దుగా పిలుస్తుంటారు కానీ అతడి పూర్తి పేరు వీరమాచనేని జగపతి చౌదరి. నేడు ఈ ఫ్యామిలీ హీరో పుట్టినరోజు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న, ప్రతినాయకుడిగా అదరగొట్టిన అది జగపతి బాబుకే సాధ్యం అనేలా టాలీవుడ్ లో తన ముద్ర వేసుకున్నాడు.
తండ్రి ప్రముఖ దర్శకనిర్మాత బి.వి.రాజేంద్రప్రసాద్. సినిమాల్లోకి  సులభంగానే ఎంట్రీ ఉంటుంది కానీ 12 ఏళ్ల వయసులోనే తల్లికి చిత్ర పరిశ్రమలోకి వెళ్లను అనే మాట ఇచ్చాడు జగ్గుభాయ్. అందుకోసమే సొంత కాళ్ల పై నిలపడాలని వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. కానీ మనసు మాత్రం సినిమా చూట్టూనే తిరుగుతూ ఉండేది. ఇక చేసేదేం లేక మనసు మాటే వినాలని డిసైడ్ అయిపోయి టాలీవుడ్ లోకి నటుడిగా  ఎంటరైపోయాడు.
సొంత నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణంపై 1989లో తండ్రి దర్వకత్వంలో ‘సింహస్వప్నం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు ఈ ఫ్యామిలీ హీరో. ఆరంభంలోనే తొలి సినిమాతోనే ద్విపాత్రాభినయంతో మెప్పించాడు. కానీ మొదటి సినిమా తనని, తండ్రిని చాలా నిరాశకు గురి చేసింది చాలా సందర్భాలలో గుర్తు చేసుకున్నాడు జగపతి బాబు. తర్వాత మంచి ఫ్యామిలి సినిమాలతో ప్రేక్షకుల్లో, చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందాడు.
‘పెద్దరికం’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాం గోపాల్ వర్మ‘గాయం’మూవీతో హీరోగా స్థిరపడ్డాడు. ‘శుభలగ్నం’,‘మావిచిగురు’, ‘పెళ్లీ పీటలు’ వంటి చిత్రాలతో ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో  ‘అంతఃపురం’ సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్ర తన కెరీర్ లోనే హైలెట్. దీనికి ఉత్తమ సహాయనటుడిగా నంది పురస్కారం వరించింది.
ఇదే సినిమాను హిందీలో ‘శక్తి’ అని రీమేక్ చేస్తే జగపతి బాబు పాత్రను షారుఖ్ ఖాన్ పోషించాడు. జగపతి లాగా తాను ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయానని షారుక్ స్వయంగా ఒప్పుకున్నాడు. ‘లెజెండ్’ సినిమాతో ప్రతినాయకుడిగా మారాడు. తన సినీ కెరీర్ లో 7 నందులు, 4 ఫిల్మ్ ఫేర్ , 2 సైమా అవార్డులు అందుకున్నాడు జగ్గూ భాయ్.
మరికొన్ని సినీ కథనాలు…
2
1
RELATED ARTICLES

Most Popular

Recent Comments