July 28, 2025 5:30 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Divorce: విడాకుల కోసం భార్యతో కోర్టు మెట్లెక్కిన కోలీవుడ్ స్టార్ హీరో

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ కోలీవుడ్ నటుడు (Kollywood Actor) జయం రవి (Jayam Ravi) ఆయన భార్య ఆర్తి (Aarti) విడాకుల కేసు (Divorce Case)లో మరో మలుపు తిరిగింది. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు (Chennai Family Court) ముందుకు వీరి విడాకుల కేసును వచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరు కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం (Alimony) ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖాలు చేసింది.

రాజీ కోసం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని న్యాయమూర్తి వారికి సూచించగా.. తన భార్య ఆర్తితో కలిసి జీవించలేనని జయం రవి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. విడాకులు మంజూరు చేయాలని రవికి చెందిన లీగల్ టీమ్ కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో భర్త నుంచి విడాకులు కోరుతున్న జయం రవి తనకు నెలకు రూ.40 లక్షల భరణం ఇవ్వాలని ఆర్తి పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది.

గత ఏడాదే తాను భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన అనుమతి లేకుండా ఈ విషయం బయటకు వచ్చిందంటూ ఆర్తి మండిపడ్డారు. గాయని కెనీషాతో రవికి ఉన్న స్నేహం వల్లే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. అందుకు విడాకులు తీసకుంటున్నారని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి రవి, కెనీషా కలిసి హాజరుకావడం ఈ వదంతులకు మరింత బలం చేకూర్చింది.

Share This Post
error: Content is protected !!