August 6, 2025 7:39 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన షెడ్యూల్ ఇదే

భారత్ సమాచార్.నెట్: అమెరికా ఉపాధ్యక్షుడు (America Vice President) జేడీ వాన్స్ (JD Vance) తన తొలి భారత పర్యటన (Indian Visit) నిమిత్తం సోమవారం ఢిల్లీ (Delhi) చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలోని విమానాశ్రయానికి చేరుకున్న జేడీ వాన్స్‌ కుటుంబానికి (JD Vance Family) కేంద్ర మంత్రి అశ్వీని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలతో కళాకారులు జేడీ వాన్స్ దంపతులను ఆహ్వానించారు. ఈ నెల 24 వరకూ వారు భారత్‌లో ఉండనున్నారు. ఇకపోతే జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత భారత్‌కి రావడం ఇదే మొదటిసారి. జేడీ వాన్స్ వెంట ఆయన కుటుంబం.. అమెరికా నుండి వచ్చిన ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

జేడీ వాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సుంకాల విధానం, ప్రాంతీయ భద్రత, ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ, వాన్స్‌ దంపతులు సహా అమెరికా ప్రతినిధుల కోసం ఒక ప్రత్యేక విందును ఇవ్వనున్నారు. విందు అనంతరం, సోమవారం రాత్రే వాన్స్‌ దంపతులు జయపుర్‌కి ప్రయాణం చేస్తారు. అక్కడ వారు ప్రముఖ రాంభాగ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేయనున్నారు.
మంగళవారం ఉదయం వారు జయపుర్‌లోని ముఖ్య చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. ఇందులో ప్రసిద్ధ అంబర్ కోట కూడా ఉంది.
అదేరోజు మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జేడీ వాన్స్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ట్రంప్ అధ్యక్షతన భారత్-అమెరికా సంబంధాలు ఎలా విస్తరించాయో వివరించనున్నారు. ఈ సమావేశానికి విదేశీ విధాన నిపుణులు, భారత ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. ఇక ఏప్రిల్ 23న ఉదయం తాజ్ మహల్, భారతీయ కళలను ప్రతిబింబించే శిల్పాగ్రామ్‌ను సందర్శించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ జయపుర్‌కి తిరిగి వెళ్తారు. చివరగా, ఏప్రిల్ 24వ తేదీన జయపుర్ నుండి బయలుదేరి అమెరికా తిరుగు ప్రయాణం అవుతారు.
Share This Post