భారత్ సమాచార్, హైదరాబాద్ ;
భారీ ఉత్కంఠ మధ్య హర్యాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. చాలా చోట్ల అభ్యర్థులు తక్కవ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు హర్యాణ ఎన్నికల్లో ఆ పార్టీని వెంటాడాయన్నారు. కొందరిని కొంతకాలం నమ్మించ వచ్చేమో కానీ.. అందరినీ ఎల్లకాలం కాంగ్రెస్ మోసం చేయలేదని తేలిపోయిందన్నారు. అబద్ధాల పునాదులపై రాజకీయం చేసే కాంగ్రెస్ కు అక్కడి ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారన్నారు. బీజేపీని ఢీకొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు తప్ప కాంగ్రెస్ లేదని మరోసారి స్పష్టమైందన్నారు. 2029లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో బలమైన కీలక పాత్ర ప్రాంతీయ పార్టీలదేనని జోస్యం చెప్పారు.