July 28, 2025 12:29 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Supremecourt: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా బీఆర్ గవాయ్

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai) బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐగా ఉన్న న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) మే 13న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానాన్ని జస్టిస్ గవాయ్ భర్తీ చేయనున్నారు. కొలిజియం సిఫార్సు మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జస్టిస్ గవాయ్‌ను సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మే 14న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన గవాయ్ 1985లో న్యాయవాదిగా తన ప్రాక్టీస్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. అనంతరం 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా సేవలందించారు.
1992లో ఆయన నాగ్‌పూర్‌ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ హోదాలో పనిచేశారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు. ఆయన 2003లో బాంబే హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 64 ఏళ్ల జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 2025లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సిజెఐ పదవీకాలం 2025 మే 14 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.
Share This Post
error: Content is protected !!