July 28, 2025 5:36 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Kalki 2898 AD: ఐఎఫ్ఎఫ్ఎం నామినేషన్స్‌ రేసులో ప్రభాస్ కల్కి

భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘కల్కి 2898 AD’. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న పార్ట్ 2 షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఇటీవల నాగ్ అశ్విన్ వెల్లడించారు.

పాన్ ఇండియా  స్థాయిలో ఎంతో సక్సెస్ అందుకున్న ఈ చిత్రం మరో ఘనత సాధించింది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ నామినేషన్స్‌‌లో కల్కి చోటు సంపాదించింది. తాజాగా ఐఎఫ్ఎఫ్ఎం నామినేషన్ జాబితాను విడుదల చేయగా అందులో ప్రభాస్ కల్కి ఉత్తమ్ చిత్ర విభాగంలో పోటీ పడుతోంది. తెలుగు నుంచి నామినేషన్స్‌​లో స్థానం దక్కించుకున్న ఏకైక సినిమా కల్కి 2898 ఏడీ కావడం విశేషం.
ఇక ఈ ఉత్తమ సినిమా కేటగిరీలో హోమ్‌బౌండ్‌, ఎల్‌2: ఎంపురాన్‌, స్త్రీ 2, మహారాజ్‌, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ తదితర సినిమాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ వేదికగా ఈ భారీ ఈవెంట్ జరగనుంది. ఆగస్టు 14 నుంచి 24 వరకూ ఈ వేడుక జరగనుంది. తొలి రోజే ఈవెంట్‌లోనే అన్ని కేటగిరీల విజేతలను ప్రకటిస్తారు. కాగా 2024 జూన్‌ 15 నుంచి 2025 జూన్‌ 14 వరకూ విడుదలైన సినిమాలను ఈ పురస్కారాల్లో పరిగణలోకి తీసుకున్నారు.
Share This Post
error: Content is protected !!