భారత్ సమాచార్.నెట్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న థియేటర్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు మరో ఆరు రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ‘కన్నప్ప మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో సినిమా నిర్మాణంలో ముఖ్య సన్నివేశాలు, తెర వెనుక విశేషాలను కళ్లకు కడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.
దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ మేకింగ్ వీడియోలో భారీ సెట్‌లను, అంతర్జాతీయ సాంకేతిక బృందాలు సినిమా వెనుక ఉన్న కఠినమైన కృషిని చూపిస్తున్నాయి. దట్టమైన అడవులు, అద్భుతమైన దేవాలయాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాగే మంచు విష్ణు యాక్షన్ మేకింగ్ విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. మేకింగ్ వీడియోలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ కుమార్, కాజల్, శివ రాజ్‌కుమార్, మోహన్ బాబు వంటి స్టార్ కాస్ట్ పాత్రలు.. వారి ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ ‘కన్నప్ప’ కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.
అయితే సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తారు. కానీ మంచు విష్ణు వ్యహాత్మకంగా సినిమా విడుదలకు ముందే మేకింగ్ వీడియోను బయటపెట్టారు. దీంతో సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం లేకపోలేదు. కాగా మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. మంచు విష్ణు తన సొంత బ్యానర్ అవ ఎంటర్టెన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి నిర్మించాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటించారు.