Homemain slides'కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలి'

‘కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలి’

భారత్ సమాచార్, ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోస్ట్‌కు ముప్పు పొంచి ఉంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలవడం, విచారణ జరిగిన సంగతి తెలిసిందే. జైలులో ఉండి పాలించే విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ముందుకు మరో పిటిషన్ వచ్చింది. హైకోర్టులో హిందూసేన పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పోస్ట్ నుంచి తక్షణమే తప్పించాలని అందులో కోరింది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆదేశాలు ఇవ్వాలని హిందు సేన తన ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొంది. లెప్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పాలనా వ్యవహారాలను చూడాలని సూచించింది.

ఇంతలోనే మరో పిటిషన్:
ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని అభిప్రాయ పడింది. ఇంతలో మరో పిటిషన్ దాఖలు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ముఖ్యమంత్రి జ్యుడిషీయల్ కస్టడీ లేదంటే పోలీస్ కస్టడీలో ఉంటూ పరిపాలించే అవకాశం లేదని హిందూ సేన పేర్కొంది. ఆ విధంగా పరిపాలించాలని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా అభిప్రాయ పడ్డారు.

మరి కొన్ని రాజకీయ విశేషాలు…

‘‘తీహార్ క్లబ్ కు స్వాగతం… కేజ్రీవాల్’’

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments