Homebreaking updates newsPahalgam: పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది వీరే

Pahalgam: పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది వీరే

భారత్ సమాచార్.నెట్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మరణించగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడి చేసింది తామేనని టీఆర్‌ఎఫ్(ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ప్రకటించిన విషయం విధితమే. తాజాగా ఈ దాడి వెనుక ఉన్న అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వారిలో ముగ్గురి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించిన అధికారులు.. వారికి మూసా, యూనిస్‌, ఆసీఫ్ అనే కోడ్ నేమ్‌లు ఉన్నట్లు కూడా తెలిపారు. మతం, పేర్లు అడిగి చంపేసిన ఆ దుర్మార్గులు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబబంధ సంస్థ టీఆర్ఎఫ్ సభ్యులే పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సమయంలో పలువురు తృటిలో తప్పించుకున్నారు. అది కూడా నిమిషాల వ్యవధిలోనే కావడం గమనార్హం. ఉగ్రదాడి నుంచి బయట పడిన ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల మేరకు ఊహా చిత్రాలను రూపొందించారు. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో ప్రత్యక్ష సాక్షులు వారి ముఖాలను చూశారు. ఊహా చిత్రాల ఆధారంగా సైన్యం వేట కొనసాగిస్తోంది. ఓ ఉగ్రవాది ఆటోమేటెడ్ తుపాకీతో ఉన్న ఫోటో కూడా విడుదలైంది. కాగా, 2017 తర్వాత టూరిస్టులపై జమ్మూకాశ్మీర్‌లో దాడి జరిగింది ఇదే తొలిసారి. 2019 ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే.
మరోవైపు పర్యాటకులపై దాడికి బైసరన్‌ లోయను ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎక్కువమంది పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని, వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు బలితీసుకునేందుకు ఉగ్రవాదులు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు. బైసరన్‌ లోయ ప్రాంతంలో భద్రతా చర్యలు తక్కువగా ఉండడాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. పహల్గాం నుంచి ఈలోయకు చేరాలంటే సుమారు 6.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. లోయ చుట్టూ అటవీ ప్రాంతం ఉండటం కూడా పారిపోవడానికి అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు ఉగ్రవాదులు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments