భారత్ సమాచార్.నెట్: ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నారు. ‘కే ర్యాంప్’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తాజాగా ఈ చిత్రంలోని కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కిరణ్ లుక్ అదిరిపోయింది. మాస్ గెటప్‌లో చొక్కా వేసుకుని, లుంగీ ధరించి చిరునవ్వుతో స్టైల్‌గా ముందుకు నడుస్తూ కనిపించాడు. వెనుకవైపు ఫైర్ ఎఫెక్ట్‌లతో ఉన్న హార్ట్ షేప్ బాటిల్స్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్‌తోనే హైప్ క్రియేట్ చేయగా… మరోసారి హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ మరియు శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. జైన్స్ నానికి ఇది తొలి చిత్రం కాగా.. కథ, స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందిస్తున్నారు. ఇక కిరణ్‌కు జోడిగా మలయాళ హీరోయిన్ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. మూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
కిరణ్, చేతన్ కాంబోలో ఇది మూడో చిత్రం. ఇంతకు ముందు వచ్చిన ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీస్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సాగుతుండగా.. ఈ దీపావళికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘క’ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన దిల్ రూబా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం కిరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ త్వరలో రిలీజ్ కానుంది.