July 30, 2025 4:56 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Kubera: రేపే కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్‌ లాంచ్ కూడా! 

భారత్ సమాచార్.నెట్: శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కుబేర’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఇందుకు సంబంధించిన తేదీని ప్రకటించింది చిత్ర బృందం.
 జూన్ 15న హైదరాబాదులో ప్రీ  రిలీజ్ ఈవెంట్‌ వేడుకను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా కుబేర సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీలో ధనుష్, నాగార్జున, రష్మికలతో పాటు జిమ్ సర్బ్, ప్రియాంశు ఛటర్జీ, దలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాలో ధనుష్ ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో బిచ్చగాడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుండగా.. నాగార్జున ఈడీ అధికారి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, స్పెషల్ వీడియోస్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.
Share This Post