July 28, 2025 12:26 pm

Email : bharathsamachar123@gmail.com

BS

ఏపీ లాసెట్‌ 2024 దరఖాస్తుకు చివరి అవకాశం

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఏపీ లాసెట్ 2024కు దరఖాస్తు చేయాలనుకునే వారికి మరో ఒక్క రోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. రూ.3 వేలు లేట్ ఫీజ్ సాయంతో మే 26 నుంచి మే29వరకు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు అప్లికేషన్‌లో తప్పులను సరి చేయడానికి అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు చేసుకోని వారు లాసెట్ 2024కు దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ (AP LAWCET 2024), పీజీ లాసెట్‌(AP PG LCET 2024) ఉమ్మడి నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీలతో పాటు రెండేళ్ల పీజీ లా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 9వ తేదీ 2024 న లాసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఏడాది లాసెట్‌ ప్రవేశ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) నిర్వహిస్తోంది.

మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల కోసం లాసెట్‌ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి. పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్ని ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది. 2024 జూన్ 3 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఏపీ లాసెట్ 2024 పరీక్షను 2024 జూన్ 9న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే విడతలో నిర్వహించనున్నారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ని జూన్ 10వ తేదీన విడుదల చేసి, అభ్యంతరాలపై విండోను జూన్ 11వ తేదీన 2024న ఓపెన్ చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు 2024 జూన్ 12 వరకు గడువు ఉంది.

ఏపీ లాసెట్ ఎలా దరఖాస్తు చేయాలి…

Step 1 : ఏపీ లాసెట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో Eligibility, Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లించాలి.

Step 3 : ఆ తర్వాత ఫీజు పేమంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.

Step 4 : ఫీజు పేమంట్ తర్వాత అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

Step 5 : అభ్యర్థి Print Application form ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ను కచ్చితంగా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

మరికొన్ని వార్తా విశేషాలు…

టీటీడీ కళాశాలల్లో ప్ర‌వేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Share This Post
error: Content is protected !!