Homebreaking updates newsGanguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌ నుంచి లేటెస్ట్ అప్‌డేట్!

Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌ నుంచి లేటెస్ట్ అప్‌డేట్!

భారత్ సమాచార్.నెట్: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించనుండగా.. లవ్ రంజన్ నిర్మించనున్నారు. తాజాగా ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను సోషించనున్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో రాజ్‌కుమార్ రావు అధికారికంగా ధృవీకరించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

తెరపై గుంగూలీలా కనిపించేందుకు టెన్షన్‌గా ఉందన్నారు రాజ్‌కుమార్. గంగూలీ బయోపిక్‌లో నటించడం ఓ పెద్ద రెస్పాన్సిబిలిటీ అని.. కానీ ఈ జర్నీ చాలా ఫన్‌గా ఉంటుందన్నారు. తన భార్య పత్రలేఖ వద్ద బెంగాళీ భాషను నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ సినిమా ప్రకటన వెలువడిన అనంతరం.. తన పాత్ర పోషించేందుకు రాజ్‌కుమార్ రావు అయితే బాగుంటుందంటూ ఓ సందర్భంలో గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే గంగూలీ బయోపిక్‌కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. గంగూలీ పర్సనల్ లైఫ్‌తో పాటు క్రికెట్ కెరీర్‌ను మూవీలో చూపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి నటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే దాదాపు 2 దశాబ్దాల పాటు క్రికెట్‌లో సత్తా చాటారు దాదా. 2008లో ఆటకు వీడ్కోలు పలికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.

 

RELATED ARTICLES

Most Popular