July 28, 2025 12:27 pm

Email : bharathsamachar123@gmail.com

BS

ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా: రేవంత్ రెడ్డి

భారత్ సమాచార్,హైదరాబాద్: చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ‘మీట్ ద ప్రెస్’ నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ ఒక గేటు మాత్రమే ఓపెన్ చేశామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ముందు ఎవరెవరు చేరుతారో ఇప్పుడే చెప్పలేం అని అన్నారు. విపక్ష పార్టీ ఖాళీ అయ్యేవరకు ఆపరేషన్ కొనసాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా.. మూసినా ఒక్కటే అన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని.. ఇక నా రాజ కీయం ఎలా ఉంటుందో అసలు కథ చూపిస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంభించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏక మైందని.. ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చార న్నారు.

కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారం నుంచి దించారని చెప్పారు. ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదని..ఏనాడూ ప్రజల స్వేచ్ఛను గౌరవించలేదన్నారు. నయా నిజాంలా మారి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారని రేవంత్ ఫైరయ్యారు.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

వంద రోజుల ప్రజాపాలనపై సీఎం…

Share This Post
error: Content is protected !!