Homemain slidesడీప్ ఫేక్ బారి నుంచి ఇలా బయటపడుదాం

డీప్ ఫేక్ బారి నుంచి ఇలా బయటపడుదాం

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ : మన దేశంలో ప్రస్తుతం ఏం నడుస్తుంది బ్రో అంటే.. ఇప్పుడంతా డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు గురించి డిస్కషన్ జరుగుతోంది బ్రో అంటూ రిప్లై వసస్తోంది నేటి తరం నెటిజన్ల నుంచి. సెలబ్రిటీల నుంచి సాధారణ అమ్మాయిల వరకు అందరూ డీఫ్ ఫేక్ బారిన పడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో ప్రధానంగా ప్రముఖ కథానాయిక రష్మిక మందన ఘటనతో డీప్ ఫేక్ అనే సాంకేతిక అంశం ప్రజలందరి నోట బాగా నానుతోంది. మేమూ డీప్ ఫేక్ బారిన పడ్డామంటూ చాలా మంది భారతీయ సెలబ్రిటీలు తమ గోడు ను వెల్లబోసుకుంటున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె  సారా టెండూల్కర్ నుంచి మొదలు పెడితే మన దేశ ప్రధాని మోదీ తో సహా అందరూ డీప్ ఫేక్ బారిన పడ్డవారే. ఈ సాంకేతిక యుగంలో ఇలాంటి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీల కారణంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే డిజిటల్ పరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకు మంచిది. అవేంటో  ఒక సారి తెలుసుకుందాం మరి…

  • – ఫేక్ కంటెంట్ అని అనుమానం వచ్చిన దేన్నీ ఇతరులకు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయకూడదు. మన మొబైల్ నుంచి వెంటనే దాన్ని తొలగించాలి.
  • అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్ కు అస్సలు ఎట్టి పరిస్తితుల్లోనూ ఆన్సర్ చేయకూడదు. వ్యక్తిగత ఆడియో, వీడియో ఫైల్స్ ను బయటి వారికి పంపకపోవటం ఉత్తమం.
  • బ్యాంకు ఖాతాలకు సంబంధించి, ఆర్థిక విషయాలకు సంబంధించిన.. ఏ సమాచారాన్ని కూడా ఇతరులకు ఫోన్ లో చెప్పకపోవటం ఉత్తమం. నిజనిజాలు నిర్దారించుకోకుండా ఎవరికీ డబ్బు పంపకూడదు.
  • సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గ్రూప్ ఫొటోల వరకే షేర్ చేయడం మంచిది. వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసే సమయంలో కచ్చితంగా ప్రైవసీ సెట్టింగులు ఉండాలి.
  • మన వ్యక్తిగత సమాచారం, చిత్రాలు ఉన్న గ్యాడ్జెట్స్ అన్నిటికీ కచ్చితంగా సెక్యూరిటీ సెట్టింగ్స్ ను పెట్టుకోవాలి.
  • వీడియో అయినా , ఫొటో అయినా, ప్రసంగమైనా చూడగానే వెంటనే నిజమని నమ్మొద్దు. నిశితంగా పరిశీలించాలి. అది నమ్మదగిన వ్యక్తుల నుంచే వచ్చిందా లేదా అన్నది మొదటగా సరి చూసుకోవాలి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

ఈ చిట్కాలతో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి

RELATED ARTICLES

Most Popular

Recent Comments