Homemain slidesగోరింటాకు చరిత్ర గురించి తెలుసుకుందాం

గోరింటాకు చరిత్ర గురించి తెలుసుకుందాం

భారత్ సమాచార్, ప్రత్యేకం ;

మహిళలకు గోరింటాకు పై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంట్లో ఏ ప్రత్యేక వేడుక జరిగిన కూడా స్త్రీల అలంకరణలో గోరింటాకు ముందు వరుసలో ఉంటుంది. ప్రత్యేకించి ఆషాడ మాసంలో కూడా గోరింటాకును పెట్టుకుంటారు. మరి ఇంతటి ప్రత్యేకత ఉన్న గోరింటాకు చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

అసలు పేరు గౌరింటాకు… గౌరి ఇంటి ఆకు…. గౌరీదేవి బాల్యంలో సాటి చెలికత్తెలతో పాటుగా వనంలో ఆడుకునే సమయంలో రజస్వల జరుగుతుంది. ఓ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే అక్కడే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను. నావలన లోకానికి ఏ ఉపయోగం కలదూ…అని అడుగుతుంది. అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధా కలుగలేదు. పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది.

పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు, స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది.
అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటూ ఉంటారు.
ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా‌ ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో!! నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా….నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు.

ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి. ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం
స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతిపై పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా….

పెద్దోళ్ళు ఏంచెప్పినా మరీ ఓ పది పన్నెండు మైళ్ల దూరదృష్టితోనే చెబుతారండీ. అపోహలేం కాదు. గోరింట ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకూ అన్నివిధాలా ఆరోగ్యం ఆనందం సంవత్సరానికోమారు పుట్టింటికి పోతుందండోయ్. అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢమాసంలో అక్కడున్నపుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట.

(వాట్సాఫ్ యూనివర్శిటీ నుంచి సేకరణ)

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

వంద రూపాయల నోటు పై ‘రాణీ కా వావ్’

RELATED ARTICLES

Most Popular

Recent Comments