Homebreaking updates newsమెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలో చిరంజీవి అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన యూకే పార్లమెంట్.. మెగాస్టర్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. మార్చి 19న యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్ వేదికగా ఈ అవార్డును చిరంజీవికి అందజేయనున్నట్లు పేర్కొంది. అయితే నటుడిగానే కాకుండా సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా ఈ అవార్డును చిరు సొంతం చేసుకోనున్నారు.

ఇక చిరుకు అవార్డు దక్కడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో లేబర్ ఎంపీ నవేందు మిశ్రా హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్‌కు చెందిన గౌరవ సభ్యులు హాజరుకానున్నారు.
సినీ ప్రయాణం
‘పునాదిరాళ్ళు’తో కెరీర్ ప్రారంభించిన చిరు ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్టార్‌గా ఎదిగారు. తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఆకట్టుకున్న మెగాస్టార్.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్లోనే టాప్ హీరోగా నిలిచారు. అంతే కాదు తన స్వయంకృషితోనే ఇండస్ట్రీలో ఎదిగానంటూ పలు ఇంటర్వ్యూల్లో కూడా చిరు చెప్పుకొచ్చారు.
అవార్డులు 
ఇప్పటివరకూ మెగాస్టార్ చిరంజీవి 9 ఫిలింఫేర్ అవార్డలు 3 నంది అవార్డులు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్‌.. 2024లో పద్మవిభూషణ్‌ అందించి గౌరవించింది. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరుకు ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును కూడా ప్రధానం చేసింది. ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చిరు చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు- 537 పాటలు- 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరుకు ఈ రికార్డు దక్కడం విశేషం.
అప్​కమింగ్ మూవీస్
అప్​కమింగ్ మూవీస్ విషయానికి వస్తే.. సోషియో ఫ్యాంటసీ బ్యాక్​‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ షూటింగ్​లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా.. అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు చిరు. ఇక ఇవే కాకుండా మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్లు కూడా చిరుకి తమ కథలను వినిపించే పనిలో ఉన్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments