Homemain slidesస్నేహితుడి సలహా విను.. కానీ పాటించకండి ఎందుకంటే?

స్నేహితుడి సలహా విను.. కానీ పాటించకండి ఎందుకంటే?

భారత్ సమాచార్, ఫిలాసఫి: సలహా ఎవరైనా చెబితే విను. కానీ అనుసరించకు. శ్రద్ధగా విను. కానీ నీ మనసు చెప్పినట్లు మాత్రమే విను. ఇతరుల సలహాని అనుసరించకు. అయితే తప్పకుండా వారు చెప్పింది మాత్రం తప్పకుండా విను. వాళ్ళు నీకు ఏంచెప్పదలచుకున్నారో అర్థం చేసుకోడానికి ప్రయత్నించు. వాళ్ళు నీ యోగక్షేమాలు కోరుకునే వాళ్ళే కావచ్చ. కానీ గుడ్డిగా వాళ్ళు చెప్పింది అనుసరించావంటే నువ్వు దారి తప్పుతావు ఆ విషయం తెలుసుకో. జనం ఎప్పుడూ తాము ఏం చెయ్యాలో ఇతరులకు చెబితే బాగుంటుందని చూస్తారు. జనం నాయకుల కోసం ఎదురు చూస్తారు. నాయకుల్ని కోరుకోవడం అనారోగ్య లక్షణం.

అయితే ఎదుటి వ్యక్తి నీకు ఏం చెప్పినా విను. ఎందుకంటే జనాలకి గొప్ప గొప్ప అనుభవాలుంటాయి. వాటిని వాళ్ళు పంచుకోవాలనుకుంటారు. అట్లాంటప్పుడు వినకపోవడం తెలివి తక్కువే అవుతుంది. వాళ్ళ అనుభవాల్ని తెలుసుకోవడంవల్ల మంచో, చెడో ఏదో ఒకటి తెసుకుంటావు. అప్పుడు నువ్వు మరింత చైతన్యవంతంగా మారడానికి అవి ఎంతో కొంత సహకరిస్తాయి. కానీ అనుసరించకు కేవలం వాటి గురించే ఆలోచించు.

   నిజమైన స్నేహితుడెవరంటే ఎవరయితే నీకు సలహా ఇ వ్వడో అతనే! అయితే నిజమైన స్నేహితుడు నువ్వు మరింత స్పృహతో, మరింత చైతన్యంగా, జీవితంపట్ల శ్రద్ధగా ఉండేందుకు సహకరిస్తాడు. నీ సొంత సాహస యాత్రకు సహకరిస్తాడు. నీ ప్రయోగశీలతకు ధైర్యాన్నిస్తాడు. నీ అన్వేషణకు ఆజ్యం పోస్తాడు. నువ్వు చాలా పొరపాట్లు చెయ్యడానికి శక్తి నిస్తాడు. ఎందుకంటే తప్పులు చెయ్యనివాడు ఏమీ నేర్చకోలేడు.

వీలయినన్ని తప్పులు చేయి, కానీ చేసినవే మళ్ళీ చేయకు. అట్లా చేస్తే నువ్వు బుద్ది హీనుడవు కావు. కొత్త తప్పులు చేయి, కొత్త తప్పులు కనిపెట్టు. వాటి గుండా నేర్చకుంటావు. నీ చురుకుతనం మరింత పదునవుతుంది. ఎందుకే అనుభవ పూర్వకంగా తెలుసుకున్నప్పుడే వాటి గురించి లోతుగా ఆలోచిస్తావు. తప్పటి అడుగులు వేయకుండా ఉంటావు.

నిజమైన స్నేహితులు ఖచ్చితమయిన సలహాలివ్వరు. ఎందుకంటే ఈ రోజు కరెక్టు అయ్యింది రేపు కాకపోవచ్చ. సందర్భాలు మారుతూ ఉంటాయి. కాబట్టి సందర్భాన్ని అనుసరించి సహజ స్పందనని అనుసరించి సాగిపో. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని వారి మాటలు వినకు. నీ అస్తిత్వం మీద ఆధారపడు. చివరికి సలహాలు తీసుకో.. కానీ వాటిని ఆచరించాలో లేదో నువ్వే తెలుసుకో. గుడ్డిగా ఎవరినీ, దేన్నీ నమ్మకు జాగ్రత్త.

మరిన్ని కథనాల కోసం

ప్రేమ.. ద్వేషం అంతా యాదృచ్ఛికమే

RELATED ARTICLES

Most Popular

Recent Comments