July 28, 2025 6:22 pm

Email : bharathsamachar123@gmail.com

BS

లోక్ సభ పోల్స్.. టీ కాంగ్రెస్ ఫుల్ జోష్

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఇప్పడు జరిగే లోక్ సభ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్, బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అలాగే అధికార కాంగ్రెస్ కూడా 17 లోక్ సభ సీట్లలో డబుల్ డిజిట్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉండగా మీడియా, సర్వే సంస్థలు కూడా జనాల నాడీ పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజగా టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే సంస్థ తన రిపోర్టును వెల్లడించింది.

ఆ సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8-10 సీట్లు, బీఆర్ఎస్, బీజీపీలు 3-5 సీట్లు, ఎంఐఎం ఒక సీటు సాధిస్తుందని చెప్పింది. ఈ సర్వే ఫలితాలతో కాంగ్రెస్ లో కొత్త జోష్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి, జనాల మూడ్, ఆయా పార్టీల శాతాలు.. లాంటి వన్నీ పరిగణలోకి తీసుకుని ఈ సర్వే చేసినట్టు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ ఎంపీలు తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్యే సీటును ఉంచుకున్నారు. అంటే ప్రస్తుతానికి లోక్ సభలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ బలం జీరో అన్నమాట. మరో నాలుగు నెలల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించి తెలంగాణలో లార్జెస్ట్ ఎంపీలు సాధించిన పార్టీగా లోక్ సభలో అడుగుపెడ్తామని ఆ పార్టీ క్యాడర్ ఉత్సాహంగా చెపుతోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన కూడా ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ సీన్ రిపీట్ అవ్వటం కొంచెం కష్టం గానే కనిపిస్తోంది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీ నడుమ సాగే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరికొన్ని కథనాలు…

ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా: రేవంత్ రెడ్డి

Share This Post
error: Content is protected !!