భారత్ సమాచార్, ఫిలాసఫి: నేను ఒక ఆత్మకథ చదువుతున్నా.. రాజు ఎక్కడికో ప్రయాణమవుతూ ఉంటే ట్రెయిన్ చాల ఆలస్యమయిందట! బహుశా అక్కడ ఒక టాక్సీ కూడా లేదు. అది అర్ధరాత్రి. చలి వివరీతంగా ఉంది. టాక్సీలు కనిపించకపోవడంతో అతను ఒక రెస్టారెంట్‌కు పోయాడు. అది అప్పుడే మూస్తున్నారు. కౌంటర్లో ఉన్న స్త్రీ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇతన్ని చూసి ఆగింది. ఏం కావాలని అడిగింది. కాఫీ కావాలని అడిగాడు. ఈ సమయంలో కష్టం షాపు మూసి వేస్తున్నాం అని చెప్పింది. అతి కష్టం మీద కాఫీ చేసి ఇచ్చింది. కాఫీ తాగాడు. అక్కడ వీళ్ళు తప్ప ఎవరూ లేరు. మెల్లగా కబుర్లలోకి దిగారు. ఆమె ‘ఈ సమయంలో నీకు టాక్సీ దొరకడం కష్టం. నాతో పాటు కార్లో రండి మమ్మల్ని నేను మీ ఇంటి వద్ద దించుతాను’ అంది.
అతను కారు ఎక్కాడు. వాళ్ళ అభిప్రాయాలు కలిసి ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఎవరయితే ఈ ఆత్మకథ రాశారో అతని తల్లి ఆమె! అంటే వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారన్న మాట! ఆ సంగతి చెబుతూ ‘ట్రెయిన్ సమయానికి వచ్చివుంటే నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టేవాణ్ణి కాను. అట్లాగే సమయానికి టాక్సీ దొరికినా అదే పరిస్థితి. లేదూ ఆ స్త్రీ అతన్ని కార్లోకి ఆహ్వానించకున్నా ఈ ప్రపంచంలోకి వచ్చేవాణ్ణి కాను అనుకున్నాడు. ప్రేమ పుట్టడానికి.. ఎంతో సమయం పట్టడదు. అదే ప్రేమ ద్వేషంగా మారడానికి కూడా ఎంతో సమయం పట్టదు. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అంతా మన చేతులో ఏం ఉండదు. ఆ సమయానికి అది అలా జరిగిపోవాల్సిందే. కేవలం మనం నిమిత్త మాత్రులమే అనుకోని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
అన్నీ యాదృచ్ఛికాలే! జనం మత్తులో బతుకుతారు. అచేతన స్థితిలో జీవిస్తారు. నీ ప్రేమ యాదృచ్ఛికం, నీ ద్వేషం యాదృచ్ఛికం! నీ స్నేహం, నీ శతృత్వం అన్నీ యాదృచ్ఛికాలే! యాదృచ్ఛికంగా ఉండడం మానేయ్యండి! నీతో నువ్వు స్పృహలో ఉండు. కొంత చైతన్యంతో ఉండు. ఏం జరుగుతుందో చూడు. మెల్లమెల్లగా నీ చైతన్యంతో నువ్వు పని చెయ్యడం మొదలుపెడితే నీలోంచీ నీ చైతన్యంనించి అద్భత శక్తి ఆవిర్భవించిడం చూస్తావు. అప్పుడు నీ సమస్త జీవితం సంపూర్ణంగా సాగుతుంది.