భారత్ సమాచార్, హైదరాబాద్ : తెలంగాణ అంతటా ఇప్పుడు జనాల్లో ఒకటే హడావిడి. గ్యాస్ ఇ కేవైసీ చేసుకోకుంటే గ్యాస్ సబ్సిడీ రాదట అనే అపొహతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ క్యూలు కడుతూ నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇ కేవైసీ కి డిసెంబర్ 31 చివరి తేదీ అని సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే గ్యాస్ డీలర్లు మాత్రం అదేమి లేదని కొట్టిపారేస్తున్నారు. అయినా కూడా ప్రతీ ఒక్కరూ ఇ-కేవైసీ కచ్చితంగా చేసుకోవాలి. దానికి గ్యాస్ ఏజెన్సీల చుట్టు తిరగాలా? అంటే అవసరం లేదు. ఇంట్లో నుంచే చాలా ఈజీగా చేసుకోవచ్చు.
- ముందుగా ఎల్పీజీ గ్యాస్ అధికారిక వెబ్ సైట్ www.mylpg.in లోకి వెళ్లాలి.
- అక్కడ కుడివైపున మీ గ్యాస్ ఏజెన్సీ పేరు ఉన్న ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నంబర్ తో సైన్ ఇన్ అవ్వాలి. లేకుంటే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పై మీ గ్యాస్ కనెక్షన్ కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
- ఎడమ వైపు కనిపించే ఆధార్ అథెంటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అథెంటిఫికేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ విజయవంతంగా అథెంటిఫికేషన్ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది.
- మీరు ఓసారి స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆధార్ అథెంటిఫికేషన్ ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయండి. అప్పుడు ఇ-కేవైసీ ఇప్పటికే పూర్తి చేశారు అనే మెసేజ్ వస్తుంది.
ఇక ఆఫ్ లైన్ లో ఇ-కేవైసీ చేయాలనుకుంటే.. సంబంధిత దరఖాస్తు ఫారం నింపి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4-5రోజుల్లో మీ కేవైసీ ప్రాసెస్ పూర్తయినట్టే.