భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి: హైదరాబాద్ నగరంలో, నగర శివారులో ఇటీవల అగ్నిప్రమాద ఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం ఒక్కసారిగా మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ప్లాస్టిక్ కంపెనీ కావడంతో మంటలు పెద్దమొత్తంలో వ్యాపించాయి. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఇంకా ఏదైనా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
