భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పీ.రాంబాబుతో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నూతన రేషన్ కార్డులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జూలై 14న తిరుమలగిరికి రానున్నట్లు, తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు కేటాయించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ప్రతి ధరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, వేగవంతంగా అర్జిదారులకు సరియైన సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులలో భూసమస్యలపై 47, ఎంపీడీవోలకు 13, డీపీవో 10, ఇతర శాఖలకు సంబందించి 25, మొత్తం 95 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్డీ ఏపీడీ వీవీ అప్పారావు, డీపీవో యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఈవో అశోక్, సీపీవో కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share This Post