July 28, 2025 7:56 am

Email : bharathsamachar123@gmail.com

BS

Manchu Vishnu: ‘కన్నప్ప’.. మంచు విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

భారత్ సమాచార్.నెట్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” జూన్ 27న వరల్డ్ వైడ్‌‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ ఇప్పుడు థియేటర్స్‌లో సందడి చేస్తోంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ రెస్పాన్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి హోల్డ్‌నే చూపిస్తోంది.

అయితే కన్నప్ప చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ చిత్రం మొదటి రోజే రూ.9 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి.. విష్ణు కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్‌ను సాధించింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో ‘కన్నప్ప’కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల రోజు తెలుగు వెర్షన్‌ 55.89శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయగా.. రాత్రి షోలలో 69.87% వరకు ఆక్యుపెన్సీ నమోదై థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు వెలిసాయి.

వీకెండ్ కావడంతో ఇవాళ రేపు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే చాలా మంది ఈ సినిమాకు ప్రభాస్ కోసం మాత్రమే వెళ్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణంగా ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌ లాంటి పాన్ ఇండియా స్టార్‌లు చేసిన గెస్టు రోల్స్ కీలకంగా నిలిచాయి. విడుదలైన తర్వాత సమీక్షలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, గ్రాండ్ విజువల్స్‌, భారీ బడ్జెట్ నిర్మాణ విలువలు, నటీనటుల అభినయ పరాకాష్ట సినిమా విజయానికి తోడ్పడ్డాయి.

Share This Post
error: Content is protected !!