July 28, 2025 8:20 am

Email : bharathsamachar123@gmail.com

BS

Sanam Teri Kasam: ‘సనమ్ తేరీ కసమ్’ నుంచి నటి మావ్రా తొలగించిన చిత్ర యూనిట్

భారత్ సమాచార్.నెట్: ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindoor) కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు పాకిస్థాన్ నటి (Pakistan Actress) మావ్రా హోకేన్‌ (Mawra Hocane)కు షాక్ తగిలింది. సూపర్ హిట్ మూవీ (Superhit Movie) ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam) సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు రాధికా రావు, వినయ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. దేశమే అన్నింటికంటే ముఖ్యమని వారు స్పష్టం చేశారు. ఎవరైనా ఏరకమైన ఉగ్రదాడినైనా ఖండించాల్సిందేనని అన్నారు.
భారతీయ సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేమ అభిమానాలు సంపాదించిన వారంతా ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్ తీసుకున్న నిర్ణయాలను కొందరు విమర్శించే స్థాయికి వెళ్లడం దురదృష్టకరమన్నారు. తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని, జై హింద్ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సన్ తేరీ కసమ్ సీక్వెల్‌లో మావ్రా ఉంటే తాను నటించడానికి సిద్ధంగా లేనని హీరో హర్షవర్థన్ రాణే ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది. హీరో మరియు చిత్ర బృందం తీసుకున్న నిర్ణయంపై కొంతమంది ప్రశంసిస్తుంటే మరి కొంతమంది విమర్శిస్తున్నారు. కాగా ‘సనమ్ తేరీ కసమ్’ మూవీ 2016లో విడుదలై రూ.16 కోట్లు వసూలు చేసింది. ఇటీవల రీ-రిలీజ్‌ చేయగా రూ.41 కోట్ల వసూళ్లు రాబట్టింది. రిలీజ్ కంటే రీ రిలీజ్‌కే అధిక వసూళ్లు రాబట్టడం విశేషం. దీంతో ‘సనమ్ తేరీ కసమ్ 2’ (సీక్వెల్)ను నిర్మాణ సంస్థ చేపట్టడానికి నిర్ణయించింది.
Share This Post
error: Content is protected !!