భారత్ సమాచార్, జాతీయం ;
మన దేశంలో 120 ఏళ్ల చరిత్ర ఉన్న టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు కేవలం రూ.3,000 మాత్రమే. ఇది నిజంగా డాక్టర్ కావాలనుకునే నిరుపేద మెరిట్ విద్యార్థులకు ఒక వరం లాంటిదనే చెప్పాలి. NIRF ర్యాకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడులోని వేలూర్‌లో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC). దేశంలోనే అత్యంత తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ కోర్సు అందిస్తున్న ప్రవేటు కళాశాల ఇది.
ఎంబీబీఎస్ కోర్సుకి అతి తక్కువ ఫీజు
క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి వైద్యా విద్యా వ్యవస్థలో చాలా మంచి పేరుంది. ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సుల ఫీజులు చాలా తక్కువ. అధికారిక నివేదికల ప్రకారం, ఇక్కడి విద్యార్థులకు యాన్యువల్ ట్యూషన్ ఫీజు రూ.3,000 మాత్రమే. మొదటి సంవత్సరంలో అడ్మిషన్ సమయంలో రూ.8,800 చెల్లించాలి. యాన్యువల్ ఫీజు రూ.15,105, వన్-టైమ్ పేమెంట్ రూ.13,425 చెల్లిస్తే మొదటి సంవత్సరానికి పూర్తి ఫీజు చెల్లించినట్లే.
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ప్రకారం, దేశవ్యాప్తంగా 386 ప్రభుత్వ, 320 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 1,06,333 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 23 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ ఎగ్జామ్‌కి రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ .
ఏటా 2,600 మందికి అడ్మిషన్
క్రిస్టియన్ మెడికల్ కాలేజీని 1900లో డాక్టర్ ఇడా సోఫియా స్కడర్ స్థాపించారు. ఆమె భారతదేశంలో పనిచేసిన, యునైటెడ్ స్టేట్స్‌లోని డచ్ రిఫార్మ్డ్ చర్చ్‌కు చెందిన మెడికల్ మిషనరీస్ కూతురు. డాక్టర్ స్కడర్ 1900లో వెల్లూరులో సింగిల్ బెడ్ డిస్పెన్సరీ ప్రారంభించారు. 1902 నాటికి మహిళల కోసం 40 పడకల మేరీ టాబర్ షెల్ మెమోరియల్ హాస్పిటల్‌ను నిర్మించారు.
ఈ కాలేజీలో మెడికల్, నర్సింగ్, అనుబంధ రంగాల్లో 175 కంటే ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. పీహెడీ కూడా చేయవచ్చు. అన్ని కోర్సులకు కలిపి ప్రతి సంవత్సరం 2,600 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకుంటారు. అందులో 100 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సు MBBSలో ప్రవేశం పొందుతారు. ఈ కాలేజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందింది.