August 3, 2025 12:25 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Chiranjeevi: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు చిత్రాలు.. అవార్డు గ్రహీతలకు చిరు అభినందనలు

భారత్ సమాచార్.నెట్: భారత్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక గౌరవంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్సు‌లో అనేక విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ముఖ్యంగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ, బలగం, గాంధీ తాత చెట్టు వంటి చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నాయి. దీంతో అవార్డులు దక్కించుకున్న అందరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అవార్డులు అందుకోనున్న వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు 71వ జాతీయ అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు. జాతీయ స్థాయిలో మన తెలుగు చిత్రాలు మరోసారి సత్తా చాటాయి. తెలుగు సినిమాలు జాతీయ అవార్డులు సాధించడం ఎంతో గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు చిరు.

 

ఇకపోతే ఉత్తమ తెలుగు చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి నిలిచింది. అలాగే యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీకి రెండు క్యాటగిరీల్లో నేషనల్ అవార్డులు దక్కడం విశేషం. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతికి ఉత్తమ బాలనటిగా అవార్డు వరించింది. ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్‌, ఉత్తమ్ స్క్రీన్ ప్లేకి గాను బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్‌కు అవార్డు దక్కగా.. అదే సినిమాలోని ప్రేమిస్తున్నా పాటకు పీవీఎన్ఎస్ రోహిత్‌కు బెస్ట్ సింగర్‌గా అవార్డు లభించింది.

Share This Post