August 7, 2025 2:13 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Minister Konda Surekha: వివాదస్పదంగా మారిన కొండా సురేఖ వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచాలని ఢిల్లీలో చేస్తున్న ధర్నాలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ పాల్గొని మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి కొండా సురేఖ తెరమీదికొచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో ప్రధాని మోడీ, బీజేపీని టార్గెట్ చేశారు కొండా సురేఖ. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ప్రభుత్వం ఆహ్వానించలేదని, ఆమె వితంతువు కాబట్టే మోడీ పిలవలేదని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవలేదని… ఆమె గిరిజన మహిళ కాబట్టే ఇక్కడికి కూడా మోడీ సర్కార్ రానివ్వలేదన్నారు సురేఖ ధ్వజమెత్తారు.

రాష్ట్రపతికి వెంటనే క్షమాపణ చెప్పాలి:

ద్రౌపది ముర్ముపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి కొండా సురేఖ వెంటనే రాష్ట్రపతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ డిమాండ్ చేశారు. కొండ సురేఖకు రాజకీయ పరిజ్ఞానం లేక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు మండిపడ్డారు. .

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వివరణ ఇవ్వడం రోటీన్‌గా మారింది:

మంత్రి కొండా సురేఖ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవడం రొటీన్‌గా మారిపోయింది. గతంలో ఫోన్‌ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారమని కేటీఆర్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అంతే కాదు పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయి అంటూ కొన్ని నెలల క్రితం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయిన విషయం తెలిసిందే.

మరిన్ని కథనాలు:

Hyderabad Rains: హైదరాబాద్‌పై వరుణుడి ప్రతాపం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!

Share This Post