భారత్ సమాచార్, అమరావతి ;
ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టెట్ -2024 పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఆన్ లైన్ వేదికగా విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరయ్యారని తెలిపారు. అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఏపీ టెట్-2024 ఫలితాలను (https://cse.ap.gov.in) అఫీసియల్ వెబ్ సైట్ ని సందర్శించటం ద్వారా అభ్యర్థులు తమ రిజల్ట్ ని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని మరోసారి తెలిపారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీల మేరకు అతి త్వరలో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని వెల్లడించారు.