Homebreaking updates newsఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రెస్యూ టీమ్‌కు కూడా డేంజరే

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రెస్యూ టీమ్‌కు కూడా డేంజరే

భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: దాదాపు 15 రోజులు గడుస్తున్న ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం ఇంకా తెలియరాలేదు. గత నెల 22న టన్నెల్ ప్రమాదం జరగ్గా అందులో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, సింగరేణి సహా.. దేశంలోని అన్ని రకాల రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయినా అందులో చిక్కుకున్న వారి జాడ ఇంకా తెలియరాలేదు. దాదాపు వారు బ్రతికే అవకాశం లేదని అధికారులు అంచనాకు రాగా.. తమ వారికి కడసారి చూపైనా దక్కించేందుకు మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు.

 

ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యలపై శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమీక్షించారు. ఈ క్రమంలో రెండు మూడు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. టన్నెల్​ వద్ద ఏర్పాటు చేసిన టీబీఎం నమూనాను మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన సొరంగ ప్రమాదాల్లో ఎస్ఎల్‌బీసీ ప్రమాదం చాలా క్లిష్టమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సొరంగం 14 కిలోమీటర్ల మేర ఉందని, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

 

కార్మిక కుటుంబాలకు అండగా:

అక్కడ సహాయక చర్యలు చేపడితే.. రెస్క్యూ ఆపరేషన్ చేసేవారికి కూడా ప్రమాదమేనని అన్నారు. అందుకే రేపు రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామని తెలిపారు. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా సొరంగంలో చిక్కుకున్న వారి ఆనవాళ్లను గుర్తించేందుకు కేరళ నుంచి జాగిలాలను తెప్పించిన సంగతి తెలిసిందే అయితే బాధితులు చిక్కుకున్న అనుమానిత ప్రాంతాలను కడావర్ డాగ్స్ గుర్తించాయి. దీని ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎన్వీ రోబోటిక్ నిపుణులు కూడా లోపలికి వెళ్లి అధ్యయనం చేశారు. 12 విభాగాలకు చెందిన 650 మంది సభ్యులు నిరంతరం షిఫ్టుల వారీగా కార్మికుల జాడ కోసం శ్రమిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular