July 28, 2025 2:03 pm

Email : bharathsamachar123@gmail.com

BS

‘కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయ్యాలి’

భారత్ సమాచార్.నెట్, వరంగల్: తెలంగాణలో రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేయించారని, రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయిందని కవిత మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ వల్ల రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేశారన్నారు. నమ్మి ఓటేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. ఎన్నికల కోసం రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి రైతు డిక్లరేషన్ ఇచ్చారని, రాహుల్ గాంధీ మళ్లీ వరంగల్ వచ్చి రైతు డిక్లరేషన్ అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్‌కు ఏ శిక్ష వేయాలి:
రైతు డిక్లరేషన్‌లో మొట్టమొదటి అంశం రుణమాఫీ హామీ. రైతురుణ మాఫీని సాగదీసి సాగదీసి అమలను ప్రకటించినా , 50శాతం మంది రైతులకు ఇంకా రైతు రుణమాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీని నమ్మి అనేక మంది రైతులు కొత్తగా రుణాలు తీసుకున్నారన్నారు.
కానీ వారి రుణాలను మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కౌలు రైతులకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కౌలురైతుల గురించి మాట్లాడడం లేదన్నారు. కౌలు రైతులను మరిచిపోయినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేయాలన్నారు. రైతుబంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయ్యాలి:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఇటీవల రైతుభరోసాను ప్రకటించారని, అన్ని పంటలకు మద్ధతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విస్మరించిందన్నారు. మద్ధతు ధరపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కోటి ఉపాధి హామీ కార్డులు ఉంటే కేవలం 20లక్షల మందికే ఇస్తామన్నారని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వజమెత్తారు. కానీ వారికి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీయ్యాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధరణితో నష్టం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, కాంగ్రెస్ తెస్తానన్న భూమాత ఎక్కడా కనిపించడం లేదన్నారు. పాత ధరణి వ్యవస్థనే బాగుందని రైతులు అంటున్నారని, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ఊదరగొట్టింది కానీ కానీ నకిలీ విత్తనాలను కట్టడి చేయడానికి ఏ మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.

 

మరిన్ని కథనాలు:

MLC Kavitha: కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?

 

Share This Post
error: Content is protected !!