August 7, 2025 2:11 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Pm Modi: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు రద్దు

 భారత్ సమాచార్.నెట్: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) పలు విదేశీ పర్యటనలను (Foreign Tour) రద్దు చేసిన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మధ్యలో ప్రధాని మోదీ యూరప్‌లోని కొన్ని దేశాలకు వెళ్లాల్సి ఉంది.
అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌ సహా యూరప్‌ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉంది పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారడంతో తన పర్యటనను మోదీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రష్యాలో జరిగే విక్టరీ డే ఉత్సవాల్లో మోదీ పాల్గొనడం లేదని ఇటీవలే క్రెమ్లిన్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గర్వకారణమైన క్షణమని.. సైన్యం అద్భుతంగా పని చేసిందని ప్రశంసించారు. భారత్ త్రివిధ దళాలను ప్రధాని మోదీ అభినందించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత నెలలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో దాదాపుగా 28 మంది మరణించారు. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌పై దాడులు జరిపింది.
Share This Post