భారత్ సమాచార్, అంతర్జాతీయం : తండ్రి కూతుళ్ల బంధం అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో పవిత్రంగా చూస్తారు. బిడ్డ బుడిబుడి నడకల నుంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే దాక తండ్రి పడే కష్టాలు..తన బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంటూ తండ్రి పడే బాధలు ఎన్నని చెప్పాలి. అలాంటి బంధం.. బంగ్లాదేశ్ లోని మండి తెగలో భార్యాభర్తలుగా మారడం నిజంగా ఇది ఈ సమాజంలోనే జరుగుతుందా అని ఆలోచించేలా ఉంది.
బంగ్లాదేశ్ లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రాచీన తెగల్లో మండి తెగ కూడా ఒకటి. వీరి ఆచారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో కన్న కూతురిని తండ్రే పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది. ఊహ తెలియని వయసులో అమ్మాయిలకు తండ్రితో పెళ్లి చేసినా.. పదిహేనేళ్లు నిండినా తర్వాత కాపురం కూడా చేయిస్తారు. ఇలా ఈ తెగలో తల్లికి, కూతురికి ఒకరే భర్త ఉంటాడు. ఒక వేళ భర్త చనిపోతే అదే తెగకు చెందిన ఓ వ్యక్తిని ముందు తల్లి పెళ్లి చేసుకుంటుంది. ఆమె సంతానాన్ని అతడు సొంత పిల్లలుగా చూసుకుంటాడు. ఇక ఈ పిల్లల్లో ఆడ పిల్లలు ఉంటే సవతి తండ్రిని పెళ్లి చేసుకోవాలనే నియమం కూడా ఇక్కడ ఉంది.
ఈ వివాహాలకు కొంత మంది అమ్మాయిలు ఒప్పుకుంటున్నా, మరికొందరు మాత్రం తమ మనస్సు చంపుకుని ఈ తరహా పెళ్లిలకు ఒప్పుకుంటున్నట్టు స్థానికులు చెపుతున్నారు. రెండో తరహా అమ్మాయే ‘‘ఒరోలా దాల్బోత్’’. ఈమెకు మూడేళ్ల వయస్సులోనే తన తండ్రితో వివాహం చేశారు. ఊహ తెలిశాక ఈ బంధంలోకి బలవంతంగా అడుగు పెట్టినట్టు చెప్పింది. తమ తెగలో ఇదంతా సర్వసాధారణమని, ఈ దుస్థితిపై ఓ సందర్భంలో తన అనుభవాలను పంచుకోగా.. అప్పట్లో ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆమె నాన్న చనిపోయాక.. ఆమె తల్లి వేరే విహవాం చేసుకున్నట్టు ఒరోలా చెప్పింది. ఆపై కొన్నాళ్లకు తన సవతి తండ్రికి తాను భార్యగా మారినట్లు వాపోయింది. ఈ దురాచారాన్ని రద్దు చేసేందుకు అక్కడి మత పెద్దలు, మహిళా సంఘాలు గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నాయి. అయితే వీరి ప్రయత్నంతో ఈ ఆచారాలు క్రమంగా కనుమరుగవుతున్నట్టు అక్కడి వారు చెప్తున్నారు. కానీ ఈ ఆచారం పూర్తి స్తాయిలో అంతం అవటానికి మరి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అక్కడి మహిళ సంఘూలు తెలిపాయి.