భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
ఈ మధ్య హాలీవుడ్ అనువాద చిత్రాల్లో మన తెలుగు గొంతులు ఎక్కువగా వినపడుతున్నాయి. తాజాగా ‘ముఫాసా’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ది లయన్ కింగ్ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఈ మూవీ ప్రీక్వెల్ కూడా. తెలుగు సినీ ప్రేమికులకు ఈ సినిమా బాగా సుపరిచితమే. అప్పట్లో టాలీవుడ్ లో మంచి కలెక్షన్లే రాబట్టింది ఈ డబ్బింగ్ మూవీ. తాజాగా ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు తన గొంతును అరువు అందించారు. ఆయనతో పాటుగా బ్రహ్మానందం, అలీ గొంతులు కూడా ఇందులో వినచ్చు. దారి తప్పి పోయిన సింహం మరో అడవిలోని సమూహంలోకి చేరి అక్కడ రాజుగా ఎలా మారింది అనేది ఈ చిత్ర కథాంశం. మహేష్ బాబు ముఫాసా అనే హీరో సింహానికి గొంతును అందించాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ పే లో మహేష్ బాబు గొంతు వింటున్న ప్రేక్షకులకు వెండితెరపై సూపర్ స్టార్ సింహపు గర్జన వినటానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీకి డబ్బింగ్ చెప్పటానికి మహేష్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఫిలింసర్కిల్ టాక్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.