భారత్ సమాాచార్.నెట్: బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) భారత్ (India) వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. తాజాగా మరోసారి భారత్ ఈశాన్య రాష్ట్రాల (Northeast States)పై ఆయన నోరు పారేసుకున్నారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్ (Nepal Deputy Speaker)తో జరిగిన సమావేశంలో.. ఆయన భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, నేపాల్, భారత ఈశాన్య రాష్ట్రాల మధ్య సమగ్ర ఆర్థిక సమైక్యత కోసం ఒక ప్రణాళిక అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పరస్పర సహకారం కీలకమన్నారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో సమావేశంలో ఆయన భారత్ ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్‌కు క్రమంగా దూరమవుతున్న బంగ్లాదేశ్.. పాకిస్థాన్, చైనాలతో సంబంధాల కోసం తహతహలాడుతోంది. భారత్‌పై యూనస్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఇటీవల యూనస్ చైనాలో పర్యటించిన సందర్భంగా బంగ్లాదేశ్‌లో డ్రాగన్ తన కార్యకలాపాలు విస్తరించుకోవచ్చంటూ ఆహ్వానం పలికింది.
అంతే కాకుండా భారత్ ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు. భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారికి సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే ద్వారం. ఇది చైనాకు ఆర్థికంగా విస్తరించడానికి గొప్ప అవకాశం” అని వ్యాఖ్యానించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యల పట్ల భారత్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది కూడా.
Share This Post