Homebreaking updates newsపాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు?

పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు?

భారత్ సమాచార్, క్రీడలు : ఐపీఎల్.. ప్రపంచ క్రికెట్ లో ఈ లీగ్ కు ఉన్నంత క్రేజ్ దేనికీ లేదు. దాదాపు లీగ్ చుట్టూ లక్ష కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందంటే ఐపీఎల్ సత్తా ఏంటో చూపుతోంది. ప్రపంచ క్రికెట్ ఆగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొని తహతహలాడుతుంటారు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అంతర్జాతీయ టోర్నీలతో దేశం కోసం ఆడడం కంటే ఐపీఎల్ లో ఆడితేనే వారికి ఎక్కువ రొక్కం ముడుతోంది. ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ లీగ్ జరిగే నెలన్నర రోజులు క్రికెట్ ఫ్యాన్స్ కు అందులోనే లీనమై ఉంటారు. మస్తు మజా చేస్తుంటారు.

అందుకే ఈ లీగ్ లో తమ టీం గెలవాలని జట్టు యాజమాన్యాలు కోరుకుంటాయి. ఆటగాళ్లను ఎంత ధర చెల్లించైనా కొనాలని చూస్తుంటాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా ట్రాన్స్ ఫర్ అయిన విషయం తెలిసిందే. పాండ్యా ముంబైకి ఆడించడానికి ఆ యాజమాన్యం చెల్లించిన ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే. అక్షరాల వంద కోట్ల రూపాయలు. ఒక్క ఆటగాడికే వంద కోట్లు చెల్లిస్తున్నారంటే అతడెంత విలువైన ఆటగాడో తెలుస్తోంది. ఇప్పుడు అంతట దీని గురించే చర్చ నడుస్తోంది. పాండ్యా బంగారు బాతు కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

‘‘హార్దిక్ పాండ్యా ఎంఐకి వెళ్లిపోయేందుకు గుజరాత్ టైటాన్స్ ఎందుకు అంగీకరించింది?’’ అనే హెడ్ లైన్స్ తో రీసెంట్ గా ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించినట్లు క్రికెట్ గురించి అప్ డేట్లు అందించే ఎక్స్ యూజర్ ముఫద్దాల్ వొహ్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

ఈ వోహ్ర చేసిన పోస్టుకు ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వీక్షించారు. అయితే ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కోసం 100కోట్లు చెల్లించాల్సిన పని లేదని.. ఇలాంటివి కేవలం హైప్ తెచ్చేందుకుకే క్రియేట్ చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం హార్దిక్ బంగారు బాతు లాంటివాడు.. అతడి కోసం ముంబై రూ.100కోట్లు పెట్టినా.. అందుకు రెట్టింపు పైసా వసూల్ ప్రదర్శన ఇస్తాడు.. అని కామెంట్స్ పెడుతున్నారు.

మరికొన్ని కథనాలు…

బెంగళూరు కప్పు కొట్టింది గురూ

RELATED ARTICLES

Most Popular

Recent Comments