భారత్ సమాచార్, రాజకీయం ;
కలివిడితనం ఆయన విధానం
ప్రేమ, ఆప్యాయత ఆయన వ్యక్తిత్వం
మహబూబాబాద్ అభివృద్ధే ఆయన ధ్యేయం
సమర్థవంతమైన పాలన నీతోనే సాధ్యం
ఆదివాసీలకు అండగా నిలిచిన నాయకుడు
అణగారిన వర్గాలకు భరోసానిచ్చిన సేవకుడు
మన భూక్యా మురళి నాయక్
గిరిజన నిత్య చైతన్య శీలి
యువతకు స్ఫూర్తినిచ్చే ధీశాలి
మహనీయుల ఆశయ సాధకుడు
మహబూబాబాద్ ప్రజల ఆపద్భాందవుడు
మారుమూల తండాల్లో మార్పుకై తపించే సేవకుడు
గిరిజన గూడాల్లో నిరంతర అభివృద్ధి కృషీవలుడు
అన్నదాతలకు అండగా, యువతకు భరోసాగా
అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచిన యువ నాయకుడు
మన భూక్యా మురళి నాయక్
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాసంక్షేమం సాధ్యం
నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రధాన ధ్యేయం
అన్ని వర్గాల ప్రజలతో సమన్వయం
ప్రజాసేవకుడిగా అభివృద్ధికి శ్రీకారం
ఉచిత విద్య, వైద్యంతోనే ప్రజల్లో మార్పు
ఈసారి మురళీ నాయక్‌కే ప్రజాతీర్పు
మహబూబాబాద్ గడ్డపై పక్కా కాంగ్రెస్ గెలుపు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మానుకోట గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయమా..?, గులాబీ పూదోటగా ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో హస్తం పార్టీ పాగా వేయబోతుందా..? కంచుకోటగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదా అంటే పలు సర్వేలు అవుననే చెపుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన బానోతు శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అదేవిధంగా 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బానోత్ శంకర్ నాయకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా మురళీ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాసంక్షేమం సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో మానుకోట గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తానని మురళి నాయక్ స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం:
మహబూబాబాద్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూర్తిగా విఫలమయ్యారని, మారుమూల తండాల్లో తట్టెడు మట్టి కూడా పోయని శంకర్ నాయక్‌కు ఓట్లు అడిగి హక్కులేదని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ నాయక్ మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన సీఎం కేసీఆర్‌కు ఓటుతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం ప్రాజెక్టులు కడుతున్నామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ అవినీతి పునాదుల మీద ప్రాజెక్టులను నిర్మించారని మురళీ నాయక్ విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ నిండా ముంచారని, పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. అభివృద్ధిలో, ఇచ్చిన హామీల్లో విఫలమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.
అభివృద్ధిలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ విఫలం.. అందుకే చెప్పాలి గుణపాఠం:
మహబూబాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతమందికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చారో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమాధానం చెప్పాలని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ నాయక్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని గూడూరు, నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్ మండలాల్లోని తండాల్లో, గిరిజన గూడాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి ఏమీలేదని మురళీ నాయక్ దుయ్యబట్టారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కల్పించడం, యువతకు ఉపాధి కల్పనలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూర్తిగా విఫలమయ్యారని, నిరుపేద దళితులకు దళితబంధు, అర్హులైన వారికి బీసీ బంధు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, తదితర పథకాలను కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ఇస్తూ అర్హులైన వారిని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూర్తిగా విస్మరించారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ ప్రజలు పథకాలు అందక అవస్థలు పడ్డారని, అభివృద్ధిలో విఫలమైన శంకర్ నాయక్‌కు ప్రజలు ఓటుతో బుద్దిచెప్పాలన్నారు.
ప్రజాసంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం:
మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ధ్యాసగా, నిరంతరం ప్రజాసేవే శ్వాసగా నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా మురళి నాయక్, భూక్యా ఉమా దంపతులు మహబూబాబాద్ పట్టణంలో శ్రీనివాస నర్సింగ్ హోమ్‌ను స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలి ఛైర్ పర్సన్‌గా పనిచేసిన భూక్యా ఉమా, అందరితో కలివిడిగా నిరుపేదలకు అండగా ఆపదలో ఆపద్భాంధవుడిగా ఉంటున్న మురళీ నాయక్ నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ ఆదర్శ నాయకులుగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ నాయక్ కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని, తండాల్లో మౌలిక వసతుల కల్పనకు, యువతకు ఉపాధి కల్పన, మహబూబాబాద్ నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించేందుకు కృషి చేస్తానని మురళీ నాయక్ స్పష్టంచేశారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా మురళీ నాయక్ కోరారు.