Homeక్రైమ్బిగ్ బాస్ లో మర్డర్...హంతకుడెవరు?

బిగ్ బాస్ లో మర్డర్…హంతకుడెవరు?

భారత్ సమాాచార్, సినీ టాక్స్  : బిగ్ బాస్ సీజన్ 7 ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా అంతా ఉల్టాపుల్టాగా నడుస్తోంది. ఆకట్టుకునే టాస్క్ లతో బిగ్ బాస్ టీవీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక సోమ, మంగళవారాల్లో నామినేషన్ ప్రక్రియ ఫుల్ జోష్ గా సాగింది. కంటెస్టెంట్స్ వాదోపవాదనలతో హోరెత్తిపోయింది.

నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్లకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్నాడు. దీంతో అతడు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. టాస్క్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్లకు బిగ్ బాస్ బిర్యానీ పార్టీ ఇచ్చాడు. అర్జున్, అమర్ దీప్ మినహా మిగిలిన వారికి స్పెషల్ రూమ్ కు పిలిచి ఫుల్ మీల్స్ పెట్టారు. ఈ పార్టీ బిగ్ బాస్ భార్య ఇచ్చిన పార్టీగా బిగ్ బాస్ వారికి తెలిపాడు. మరో వైపు అర్జున్, అమర్ దీప్ లకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవరి వద్ద ఎలాంటి ఫుడ్ ఉంది.. హౌస్ లో ఎంత ఫుడ్ ఉందో లెక్కించి.. బిగ్ బాస్ కు చెప్పాలని సూచించాడు.

ఇదిలా ఉండగా.. కంటెస్టెంట్లకు బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. హౌజ్ లో బిగ్ బాస్ భార్య హత్యకు గురైందని చెప్పాడు. ఆమె వద్ద విలువైన నగలు ఉన్నాయని, అవి మిస్ అయ్యినట్టు తెలిపాడు. ఈ కేసును విచారించే బాధ్యతను పోలీసులైన అమర్ దీప్, అర్జున్ లకు అప్పగించాడు. దీంతో హౌజ్ లో మర్డర్ విషయంతో కలకలం రేగింది. హంతకుడు హౌజ్ లోనే ఉన్నాడని, పోలీసులను రంగంలోకి దించారు. మరి వారు హంతకుడిని పట్టుకుంటారా? ఇంతకీ ఎవరీ హంతకుడు..అని ప్రేక్షకుల్లోనూ, హౌస్ మేట్లలోనూ ఉత్కంఠ నెలకొంది. బుధవారం వచ్చే ఎపిసోడ్ లో ఆ వ్యవహారం ఏంటో తేలనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments