భారత్ సమాచార్.నెట్: రాష్ట్రాల గవర్నర్లు (State Governors) పంపే బిల్లులపై రాష్ట్రపతి (President) తప్పనిసరిగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు (Supremecourt) తొలిసారిగా గడవును విధిస్తూ సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) స్పందించారు. సుప్రీం వెలువరించిన ఈ తీర్పుపై వివరణ కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని లేఖ రాశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు 14 ప్రశ్నలు అడిగారు.
రాష్ట్రపతి అడిగిన 14 ప్రశ్నలు ఇవే..
- రాష్ట్రపతితోపాటు గవర్నర్‌కు అసలు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి?
- ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేస్తుంది?
- అత్యున్నత న్యాయస్థాన ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందు ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?
- ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా?
- ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
- ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ పరిశీలనపై ఆర్టికల్ 361 సంపూర్ణ నిషేధాన్ని విధిస్తుందా?
- ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
- ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు విధానపరమైన అవసరాలను నిర్ణయించవచ్చా?
- గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా?
- ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందే గవర్నర్, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధంగా ఉంటాయా?
- ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయవ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా?
- ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమలులోకి వస్తుందా?
- సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసులో గణనీయమైన రాజ్యాంగ వివరణ ఉందో లేదో నిర్ణయించి, ఆర్టికల్ 145(3) కింద ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు సూచించగలరా?
ఈ మొత్తం 14 ప్రశ్నలను రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించారు. వాటిపై తమ అభిప్రాయాలను కూడా తెలియజేయాలని సుప్రీంకోర్టును అడిగినట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని.. ఇటీవల సుప్రీం తీర్పునిచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని స్పష్టంచేసింది.
Share This Post