HomeUncategorizedనా భర్త నన్ను వేధించట్లేదు... అలియా

నా భర్త నన్ను వేధించట్లేదు… అలియా

భారత్ సమాచార్, సినీ టాక్స్: ఆర్ఆర్ఆర్ సీతమ్మ.. తాజాగా ఓ టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న అలియా భట్ మొన్ననే జాతీయ ఉత్తమ నటిగా కూడా పురస్కారం పొందింది. తన వైవాహిక జీవితంపై సాగుతున్న అబద్ధపు ప్రచారాలను మీడియో వేదికగా ఖండించింది.

బాలీవుడ్ లో క్రేజీ జంట రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికో పాప కూడా పుట్టింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నారు. సెలబ్రిటీలు కావడంతో వీరిపై ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. అయితే కొన్ని అంతటితోనే ఆగిపోతుంటాయి. కొన్ని మాత్రం సుదీర్ఘ కాలం వారిని వేధిస్తుంటూనే ఉంటాయి.

ఈక్రమంలో ఆలియా మాట్లాడుతూ.. నేను గతంలో ఓ ఇంటర్వ్యూలో నా భర్త రణబీర్ కు లిప్ స్టిక్ నచ్చదని, వెంటనే తీసేయయమన్నాడని చెప్పాను. అప్పటి నుంచి రణబీర్  పై ఎన్నో రూమర్స్, ట్రోలింగ్స్ అవుతున్నాయని, అతడిని టాక్సిక్ మేన్ గా సోషల్ మీడియా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను సహజంగా ఉండడమే ఆయనకు ఇష్టమని, ప్రపంచంలో ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయని, మా వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు చొరబడ్తారని వాపోయింది. ఇకనైనా ఇలాంటి రూమర్స్ క్రియేట్ ఆపేయాలని హితవు పలికింది.

ఇవొక్కటే కాదని, తాను కొవ్వు తగ్గించుకుని సన్నగా మారానని, చర్మం తెల్లగా కావడానికి సర్జరీ చేయించుకున్నానని ఏవేవో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని.. వాటిని తాను పట్టించుకోనని, నన్ను బాధపెట్టలేవని తన మనోగతాన్ని ఇంటర్వ్యూ వేదికగా పంచుకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments