August 4, 2025 7:08 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Naga Chaitanya: గుడ్ న్యూస్ చెప్పబోతున్నా.. నాగ చైతన్య, శోభిత!

భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత (Samantha)తో విడాకుల (Divorce) అనంతరం నాగ చైతన్య.. నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala)ను గతేడాది వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నవ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే దానిపై స్పష్టత లేదు. ఈ వార్తపై అటు అక్కినేని కుటుంబం గానీ, ఇటు శోభిత గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్త ప్రస్తుతం కేవలం ఊహాగానంగానే మిగిలిపోయింది. దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే అసలు విషయం తెలుస్తుంది.
ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్లర్‌లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక శోభిత విషయానికొస్తే.. వివాహం అనంతరం శోభిత సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
Share This Post