Homebreaking updates newsనాన్న... నా తొలి స్నేహమా

నాన్న… నా తొలి స్నేహమా

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; నాన్నను ఆరాధిస్తూ, ప్రేమిస్తూ ఇప్పటికే చాలా గీతాలు వచ్చాయి. ఆ లిస్ట్ లోకి మరో పాటను చేర్చింది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’టీం. ‘గీతాంజలి’మూవీకి సీక్వెల్ ఇది. హీరోయిన్ అంజలికి 50వ సినిమా. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య ప్రధాన పాత్రధారులు. తాజాగా ఇందులోంచి నాన్న అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. దేవుడి వరమే నువు నాకు… అంటూ సాగే గీతం నాన్న పై ఉన్న ఎమోషన్ ను మనసుకు హత్తుకునేలా క్యారీ చేస్తోంది. ఈ సింపుల్ మెలోడీ ఇప్పుడు సంగీత ప్రియులను నెట్టింట విశేషంగా అలరిస్తోంది. నాన్న.. మమతల రూపమా.. నాన్న .. నా తొలి స్నేహమా.. నాన్న..కనులకు దీపమ వంటి క్యాచీ లైన్స్ ను అందించాడు రచయిత శ్రీనివాస్ మౌళి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చగా, వేదవాగ్దేవి గీతాన్ని ఆలపించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఏఫ్రిల్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ హార్ట్ పుల్ మెలోడీని రియల్ హీరోస్ అయిన అందరి నాన్నలకు అంకితం చేస్తూ ఈ పాటపై రీల్స్ చేసి మ్యంగోమ్యూజిక్ లేబల్ కు ట్యాగ్ చేయాలని ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు.

మరికొన్ని సినీ సంగతులు…

వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments