July 29, 2025 2:37 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఎప్పటి నుంచంటే..?

భారత్ సమాచార్.నెట్, ఏపీ: ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా బెజవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ ఏడాది అమ్మవారి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వైదిక కమిటీతో కలిసి ఆయన వెల్లడించారు.

 

సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే 11 రోజులపాటు అమ్మవారి దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 29న అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఇక ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అవతారం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఏడాది నుంచి కొత్తగా కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దుర్గాదేవి అభయమివ్వనున్నారు.

 

శరన్నవరాత్రులు.. అమ్మవారి అలంకరణలు..

సెప్టెంబర్ 22న కలశస్థాపన.. బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం
సెప్టెంబర్ 23న గాయత్రి దేవి అలంకారం
సెప్టెంబర్ 24న అన్నపూర్ణ దేవి అలంకారం
సెప్టెంబర్ 25న కాత్యాయని దేవి అలంకారం
సెప్టెంబర్ 26న మహాలక్ష్మీ దేవి అలంకారం
సెప్టెంబర్ 27న లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
సెప్టెంబర్ 28న మహాచండీ దేవి అలంకారం
సెప్టెంబర్ 29న సరస్వతి దేవి అలంకారం
సెప్టెంబర్ 30న దుర్గా దేవి అలంకారం
అక్టోబర్ 1న మహిషాసురమర్దిని దేవి అలంకారం
అక్టోబర్ 2న రాజరాజేశ్వరీ దేవి అలంకారం.. సాయంత్రం అమ్మవారి తెప్పోత్సవం జరగనుంది. దసరా ఉత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు.

 

Share This Post
error: Content is protected !!