భారత్ సమాాచార్.నెట్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) స్కూల్ సిలబస్‌లో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ముద్రించిన పుస్తకాల(Printed books) ను విడుదల చేసింది. 4 మరియు 7వ తరగతి విద్యార్థులు (Students) 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ పాఠ్యపుస్తకాల (Textbooks)ను అందించనుంది ఎన్సీఈఆర్టీ. నూతన జాతీయ విద్యా విధానం (National Education Policy), నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్-2023లో ఈ కొత్త పుస్తకాలను రూపొందించింది. ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్, పార్ట్-1’ పేరుతో ఉన్న ఈ పుస్తకంలో మహాకుంభమేళా (Maha Kumbh Mela)తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను (Central Govt) ప్రస్తావించింది.
అయితే 7వ తరగతి సోషల్ పుస్తకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది ఎన్సీఈఆర్టీ. 7వ తరగతి సోషల్ స్టడీస్ నుంచి మొగల్స్, ఢిల్లీ సుల్తానుల చరిత్రను తొలగించింది ఎన్సీఈఆర్టీ. వీటి స్థానంలో మగధ, మౌర్యులు, శాతవాహనులు, శుంగలు వంటి ప్రాచీన చరిత్ర చాప్టర్లను చేర్చింది. మహా కుంభ్, భౌగోళిక శాస్త్రం, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో, బేటీ పఢావో వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారించే కొత్త అధ్యాయాలను సైతం ప్రవేశపెట్టింది. పుస్తకంలోని కొత్త పాఠ్యాంశాలు విద్యార్థులు మరింత మెరుగుపడేలా విలువలను పెంపొందిస్తాయని.. భారత సంస్కృతిని మరింత లోతుగా అధ్యయనం చేసుందుకు ఉపయోగపడతాయని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లాని పేర్కొన్నారు.
నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2023లో భాగంగా కొత్త పుస్తకాలను రూపొందించినట్లు ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. ‘భూమి పవిత్రంగా ఎలా మారుతుంది’ అనే పాఠ్యాంశంతోపాటు అన్ని మతాలు పవిత్రంగా భావించే ప్రదేశాలు, 12 తీర్థయాత్రలపై కూడా ప్రత్యక దృష్టిసారించింది. ఇందులో శక్తిపీఠాలతో కూడిన పవిత్ర భౌగోళిక ప్రాంతాలు, జ్యోతిర్లింగాలు, చార్‌ధామ్ యాత్రకు సంబంధించిన అంశాలను చేర్చింది. గ్రీకుల చరిత్రతోపాటు జానపద, సమ్రాజ్, అధిరాజా, రాజాధిరాజా అనే సంస్కృతం పదాలను కూడా చేర్చనున్నట్లు పేర్కొంది. గతేడాది 3, 6లో కొత్త పాఠ్యాంశాలు చేర్చగా ఇప్పుడు 4, 7వ తరగతుల సిలబస్ అప్‌డేట్ చేసినట్లు పేర్కొంది.