August 10, 2025 9:56 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

వైద్య‌ సిబ్బంది నిర్లక్ష్యం.. రోగి మృతి

భార‌త్ సమాచార్.నెట్‌, అనంతపురం: జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరో రోగి మృతిచెందాడు. బుక్కరాయసముద్రానికి చెందిన 75 ఏళ్ల కృష్ణమూర్తి ఆచారి జ్వరం, శ్వాస సమస్యలతో శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆక్సిజన్ అందిస్తూ చికిత్స అందిస్తున్నారు. శనివారం సీటీ స్కాన్ చేయాలని వైద్యులు సూచించగా, స్కానింగ్ కోసం తరలించే క్రమంలో సిబ్బంది ఆక్సిజన్‌ను తొలగించారు. ఆక్సిజన్ లేకుండా స్ట్రెచర్‌పై సీటీ స్కాన్ కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ ఒక గంటకు పైగా వేచి ఉండటంతో ఊపిరాడక కృష్ణమూర్తి మృతిచెందారు. గతంలో కూడా ఇద్దరు రోగులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణించారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి ఆర్ఎంవో తెలిపారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

క్షణికావేశంలో యువ‌కుడి ఆత్మ‌హత్య‌

Share This Post