భారత్ సమాచార్.నెట్: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ (National), అంతర్జాతీయ (International) గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు (New Flight Services) అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి (Minister Civil Aviation of India) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తెలిపారు.
విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం – అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ ఫ్లైట్స్ వారానికి నాలుగు రోజులు నడవనున్నాయని వివరించారు. అలాగే విశాఖపట్నం – భువనేశ్వర్ మధ్య జూన్ 12 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.